Sri Rama Navami Wishes In Telugu

Sri Rama Navami Wishes In Telugu | శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Post By : Team Helo Marathi

Post Last Updated On :

తెలుగులో శ్రీరామ నవమి శుభాకాంక్షలు : Sri Rama Navami Wishes In Telugu : శ్రీరామ నవమి అనేది భక్తి, శాంతి, మరియు సద్భావనతో నిండిన పవిత్ర రోజు. ఈ మహోత్సవం భగవాన్ శ్రీరాముని జన్మదినంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం చేస్తారు, రాముని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, మరియు భజనలతో భక్తి మార్గాన్ని అనుసరిస్తారు. శ్రీరాముని ఆదర్శ జీవితం, ధర్మ నిష్ఠత, మరియు కర్తవ్య పాఠాలు మనందరికీ మార్గదర్శకం.

ఈ పవిత్ర సందర్భంలో మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, మరియు అభిమానులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేయడానికి హలోమరాఠి మీ కోసం ప్రత్యేకంగా తెలుగు భాషలో శ్రీరామ నవమి విషెస్ సేకరించింది. ఈ శుభ సందేశాలను షేర్ చేసుకొని, శ్రీరాముని అనుగ్రహాన్ని అందరికి పంచండి! 🙏🌸✨

తెలుగులో శ్రీరామ నవమి శుభాకాంక్షలు

మనిషి జీవితంలో పెళ్లి ఒకసారే జరగాలన్నది అందరి ఆశ
సీతారాముల పెళ్లిని మాత్రం ఏటా జరిపిస్తారు
ఆ పెళ్లిని చూడటం జన్మజన్మల అదృష్టం
ఈ వివాహం ఎప్పటికీ నిత్య నూతనమే
మనందరికీ ఒక మదుర జ్ఞాపకమే!
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

రామేతి రమే రామే మనోరమే.. సహస్తనామతత్తుల్యం శ్రీరామ నామ వరాననే’
Happy Rama Navami 2025

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయః పతయే నమః రామ నవమి శుభాకాంక్షలు.

rama navami wishes
rama navami wishes

దీవెనలు మీ కుటుంబ సభ్యులపై ఉండుగాక, ఆ భగవంతుడు మీ కలలను నెరవేర్చు గాక, జై శ్రీరామ్.. రామ నవమి శుభాకాంక్షలు

శ్రీరాముడు మీ జీవితాన్ని శ్రేయస్సు, ఆరోగ్యం, శాంతితో దీవించుగాక.. Happy Rama Navami

కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో రాముడు చూపించాడు. రాముడి వ్యక్తిత్వం నుండి మనం నేర్చుకుంటే, ఎలాంటి కష్టాల నుండి బయటపడవచ్చు. శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శ్రీరామ నామాన్ని జపించడం వల్ల మన ముఖం ఎప్పుడూ చిరునవ్వుతో మెరిసిపోతుంది. మీకు హృదయపూర్వక శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

srirama navami wishes

ప్రపంచమంతా సంతోషం వెల్లివిరియాలని, భారతదేశం యావత్ ప్రపంచానికి రోల్ మోడల్గా వెలుగొందాలని శ్రీరాముడిని ప్రార్థిద్దాం.. రామనవమి శుభాకాంక్షలు.

ఈ రామ నవమి నాడు మన జీవితాల్లో ఐక్యత, సౌభ్రాతృత్వం, ధైర్యసాహసాలు పాటించి హింసను
.. Happy Sri Rama Navami

Sri Rama Navami Wishes In Telugu

శ్రీరామ నవమి నాడు సకల శుభాలు కలగాలని రాముడిని ప్రార్థిద్దాం. జై శ్రీ రామ్

srirama navami wishes
srirama navami wishes

శ్రీరామ నవమి రోజున రాముడు తన ఆశీస్సులు మీకు ప్రసాదించుగాక. రామ జపం చేద్దాం, పవిత్ర మంత్రాలను పఠిద్దాం.. జై రామ్ జై జై రామ్.. రామ నవమి శుభాకాంక్షలు

rama navami wishes

శ్రీరాముని దివ్య కృప మీకు ఎల్లప్పుడు ఉండుగాక. మీకు, మీ కుటుంబ సభ్యులకు రామ నవమి శుభాకాంక్షలు

ఈ పవిత్రమైన రామ నవమి మీ జీవితంలో ఆశ, సానుకూలత, శాంతిని తీసుకురావాలి. రామ నవమి శుభాకాంక్షలు

రామఈ రామ నవమి ఉత్సవం స్ఫూర్తితో నిండి ఉండాలని, రాముడు మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను..
Happy Sri Rama Navami 2025

Also Read : 200+ Ukhane In Hindi | पुरुषो और औरतो के लिए हिंदी उखाणे

పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవుడికి మది మందిరం
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శ్రీరామనామము త్రిమూర్తులు పూజించిన ఫలం
శ్రీరామ చరిత్ర జగమంతా ధర్మస్థాపన ఫలితం
మహర్షి వాల్మీకి రచించిన మహా కావ్యం రామాయణం
అనంత విశ్వంలో మధుర పదం శ్రీరామ నామం
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా!
కాళాత్మక పరమేశ్వర రామా!
శేషతల్ప సుఖనిద్రిత రామా!
బ్రహ్మాద్యామక ప్రార్థిత రామా!
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

ఈ శ్రీరామ నవమి
మీ ఇంట అందరికీ సుఖసంతోషాలు అందించాలి.
ఆరోగ్యాన్ని ప్రసాదించాలి.
శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు
మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

సీతారాముల జీవితం ఆదర్శప్రాయం
నిజాయితీ, సన్మార్గానికి నిలువెత్తు నిదర్శనం
సీతారాములను నిత్యం స్మరించుకుందాం
వారి జీవనయానాన్ని ఆదర్శంగా తీసుకుందాం
వారి బాటలో నడిచేందుకు కృషి చేద్దాం
మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

sri rama navami wishes
sri rama navami wishes

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే..
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!’
అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు

పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరం
శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షాలు
ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శ్రీ రామ జయరామ జయ జయ రామ!
ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

వరునిగా రాముని జూడగ..
తరుణులు మిథిలానగరిన దారులు గాచెన్..
అరవిరి కన్నుల ముదముగ..
ధరణీసుత పతిని గనగ తన్మయ మొందెన్..
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Also Read : Best 100+ Promise Day Shayari In Hindi / English

సీతారాముల కల్యాణం చూసి తరించిన వారి జన్మ సార్దకం అవుతుందట.
శ్రీ సీతారాముల అనుగ్రహంతో మీకు సర్వదోషాలు తొలగి..
సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం
రామ నామ జపంతో మంచి రోజుల కోసం
ఏకపత్నీ్వ్రతుణ్ని వేడుకుందాం
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శ్రీరామ నామం పలికేటప్పుడు పాపాలు
అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయి
మానవులకు ‘రామనామ స్మరణ’
మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Leave a Comment